पञ्चमं प्रान्तसंस्कृतसम्मेलनम्-2025
*సంస్కృతభారతీ, ఆంధ్రప్రదేశః*
*ఐదవ ప్రాంత సంస్కృత సమ్మేలనం*
*సంస్కృతభాషా ప్రియులందరికి స్వాగతం*
సంస్కృతంలోని వైజ్ఞానిక శాస్త్రాలను భావితరాలకు అందివ్వాలంటే ప్రథమంగా అందరం మన నిత్యజీవితంలో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా ఉపయోగించాలనే లక్ష్యంతో సంస్కృతభారతి స్వచ్ఛందంగా 44 సంవత్సరాల నుండి నిర్విరామంగా కృషిచేస్తున్నది. ఈ క్రమంలో సంస్కృతభారతి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ప్రాంతసంస్కృత-సమ్మేలనమ్ ఈ సంవత్సరం *నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణానికి ప్రక్కన ఉన్న చండ్ర రావూరు గ్రామంలోని రాజమాత బండ్లమాంబ ఆశ్రమంలో ఫిబ్రవరి 22, 23 తేదీలలో నిర్వహించుటకు నిశ్చయించడమైనది.*
పూర్తి సంస్కృత వాతావరణంలో నిర్వహించబడు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల నుంచి సంస్కృతజ్ఞులను మరియు సంస్కృతకార్యకర్తలను, సంస్కృతభారతి ద్వారా సంస్కృతాన్ని నేర్చుకుంటున్న విద్యార్ధులను ఆహ్వానిస్తున్నది సంస్కృతభారతి.
*విశేషకార్యక్రమములు*
సంస్కృతంలో సాంస్కృతిక కార్యక్రమములు
వస్తు, విజ్ఞాన ప్రదర్శనలు
అనుభవజ్ఞుల ద్వారా వివిధ చర్చాగోష్ఠులు
ముఖ్యంగా అఖండ సంస్కృతవాతావరణం
సంస్కృత భాషా వైభవాన్ని దర్శించటానికి కార్యక్రమానికి వచ్చే సంస్కృతజ్ఞులు మరియు సంస్కృత భాషాభిమానులు 100/- రూపాయలు చెల్లించి సంస్కృత ప్రతినిధి పంజీకరణం (రిజిస్ట్రేషన్) చేసి విచ్చేయవలసినదిగా ప్రార్థన.
*వివరములకు - 8500563074, 8801203306*.
- Post By : Andhra Pradesh
- |
- 03-02-2025
- |








.jpeg)